జగిత్యాల అంగడి బజార్లోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయాన్ని మాజీ మంత్రి జీవన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు పద్మశాలి సేవా సంఘం నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన.. ఈ ఆలయంతో తనకు విడదీయలేని అనుబంధం ఉందని కొనియాడారు. ఇక్కడ మొక్కుకుంటే కోరికలు నెరవేరుతాయని తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.