MNCL: మందమర్రి మున్సిపాలిటీలో ‘99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ అమలును మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. ఇంటి పన్నులు, ఇతర బకాయిలను 100 శాతం వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ ఆదాయాన్ని పెంచుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.