»A Chance For 18 Ministers In Revanth Reddy Cabinet
Revanth reddy: మంత్రి వర్గంలో 18 మంది మంత్రులకు ఛాన్స్?
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి రేపు రాష్ట్ర పగ్గాలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాటుకానున్న మంత్రి వర్గంలో ఎవరు మంత్రులుగా ఉంటారు? ఎవరికి ఛాన్స్ దక్కనుందనే ఆసక్తి అనేక మందిలో మొదలైంది. ఈ క్రమంలో ఆశావాహుల జాబితా వివరాలను ఇక్కడ చుద్దాం.
Telangana CM Revanth Reddy Responds To AP CM Jagan Tweet
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు(గురువారం) హైదరాబాద్లో ప్రమాణస్వీకారం చేయనున్న ఎ. రేవంత్ రెడ్డి(Revanth reddy)తో పాటు మరికొందరు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే నగరం నడిబొడ్డున ఉన్న ఎల్ బీ స్టేడియంలో ప్రమాణస్వీకారోత్సవానికి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే ఈ ప్రమాణ స్వీకారం సందర్భంగా రేవంత్ రెడ్డితో పాటు 9 మంది మంత్రులు ప్రమాణం చేయనున్నట్లు తెలిసింది. అంతేకాదు మొత్తం 18 మంది మంత్రులతో కూడిన పూర్తి స్థాయి మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే వీరిలో ఎవరెవరు ఉన్నారనేది ఇప్పుడు చుద్దాం. సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు, జి. వివేక్ లేదా ఆయన సోదరుడు జి.వినోద్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. వీరితోపాటు దామెదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మల్ రెడ్డి రంగారెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, షబ్బీర్ అలీ, జూపల్లి కృష్ణారావు, శ్రీహరి ముదిరాజ్, వీర్లబల్లి శంకర్, రేవూరి ప్రకాశ్ రెడ్డికి ఛాన్స్ దక్కనున్నట్లు తెలిసింది. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(tamilisai soundararajan) ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ప్రమాణ స్వీకార సమయాన్ని సవరించారు. మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముందుగా ప్రకటించినట్లుగా ఉదయం 10.28 గంటలకు కాదు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(rahul gandhi), ప్రియాంక గాంధీ సహా కీలక నేతలు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, పలువురు కర్ణాటక మంత్రులు, ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీ నేతలు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవిగుప్తా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండ్లియా తదితర అధికారులు బుధవారం ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు.