E.G: ప్రకృతిని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతనీ, పచ్చదనం పెంచి, పర్యావరణహిత జీవనశైలిని అలవర్చుకుని, స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర సాధనలో భాగస్వాముల మవుదామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. శనివారం రాజమండ్రిలో స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యమని తెలిపారు.