PDPL: సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో బయో మైనింగ్ పనులను వేగవంతం చేయాలని జాయింట్ డైరెక్టర్ సంధ్య సూచించారు. సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయాన్ని శనివారం జాయింట్ డైరెక్టర్ బి.సంధ్య సందర్శించారు. ఈ సందర్భంగా కమీషనర్ రమేష్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలో పలు అంశాలపై చర్చించి, మార్కండేయ కాలనీ డంపింగ్ యార్డును పరిశీలించారు.