»Do You Know The Cost Of The Six Guarantees Given By The Congress
Congress: ఆరు గ్యారెంటీలకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే స్కీమ్‌లకోసం ఏటా రూ.68,652 కోట్లు అవసరం అని తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన కొన్ని సంక్షేమ పథకాల కొనసాగించాలి. అదనంగా కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యారెంటీలు. ఇక రాష్ట్ర బడ్జెట్ సంవత్సరానికి ఎంత అవుతుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
Do you know the cost of the six guarantees given by the Congress?
Congress: తెలంగాణలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం విజయం సాధించడంలో ఆరు గ్యారెంటీలు(six guarantees) ప్రధాన పాత్ర పోషించాయి అనడంలో సందేహం లేదు. ఇవే స్కీములను కర్ణాటకలో కూడా విజయాన్నే చేకూర్చాయి. ఎన్నికల వేళ హామీలయితే ఇచ్చారు. కానీ వాస్తవంగా వాటిని నెరవేర్చాలంటే అంత సులువు కాదని ఆర్థక నిపుణులు అంచనా వేస్తున్నారు. అన్ని హామీలను తక్షణమే అమలు పరచక పోయినా కొన్నింటిని మాత్రం కచ్చితంగా నెరవేర్చాల్సి ఉంది. హామీల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు పోటీపడ్డాయి. అందులో కాంగ్రెస్ కొన్ని ఎక్కువ హామీలే ఇచ్చింది. ముఖ్యంగా ఆరు గ్యారెంటీలలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రయాణం ఉచితం, ప్రతి మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం, రైతు భరోసా కింద ఎకరాకు రూ.16 వేలు, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, విద్యాభరోసా, ఇందిరమ్మ ఇల్లు లాంటి హామీలు ఇచ్చింది.
ఇప్పటికే ఉన్న పథకాలతో పాటు కొత్తవాటిని అమలు చేయాలంటే కాంగ్రెస్ ఏటా రూ.1.2 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కేవలం ఆరు గ్యారెంటీల కోసమే ఏడాదికి రూ.68,652 కోట్లు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కోసం రూ.20 వేల కోట్లు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం, వ్యయం దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. రాష్ట్ర సొంత పన్ను ఆదాయం, కేంద్ర నిధులతో కలిపి రూ. లక్షా 72 వేల కోట్లు. రాష్ట్ర బడ్జెట్ దాదాపు రూ.1.9 లక్షల కోట్లుగా ఉందని ఆర్థిక నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆర్టీసీ లాంటి కార్పొరేషన్లు ఆర్థిక కష్టాల్లో ఉన్నాయి. ఇక మహిళలకు ఉచిత ప్రయాణం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఆర్టీసీకి రూ.10 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. 200 యూనిట్ల ఫ్రీ కరెంటు అమలు చేస్తే డిస్కమ్‌లకు ఏటా రూ.5 వేల కోట్లు చెల్లించాలి. వీటి కోసం రుణాలు తీసుకోవాల్సి ఉంటుందని, ఇప్పటికే రాష్ట్రం రుణ పరిమితిని చేరుకుందని నిపుణులు చెప్తున్నారు.