»1000 Crore Cash Prize For Revanth Reddy For It And Real Estate Business
Revanth Reddy:కి రూ.వెయ్యి కోట్ల క్యాష్ ప్రైజ్?
తెలంగాణలో రేపు కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్‌లో నెలకొన్న ప్రముఖ ఐటీ సంస్థలతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు కూడా ఈ రంగం విషయంలో సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
1000 crore cash prize for Revanth Reddy for it and real estate business
తెలంగాణలో సుమారు 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. అంతేకాదు ఈ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 7న తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి(revanth reddy) ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. అయితే ఈ పాలన ద్వారా మార్పు తెలంగాణ ఆర్థిక వృద్ధిపై, ఐటీ, టెక్ కంపెనీల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు గత ప్రభుత్వం ఆమోదించిన యునైటెడ్ స్టేట్స్‌లోని అతిపెద్ద సరుకు రవాణా సేవల సంస్థ FedEx మంగళవారం హైదరాబాద్‌లో తన ఎక్స్‌ప్రెస్ సర్వీస్ డివిజన్ మొదటి అడ్వాన్స్డ్ కెపాబిలిటీ కమ్యూనిటీ (ACC) సెంటర్‌ను ప్రారంభించింది.
దీంతోపాటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనకు ప్రజలు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే గత ప్రభుత్వం అనుమతులు తీసుకున్న కీలక సంస్థలు FedEx దాదాపు 100 మిలియన్ డాలర్ల హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టనుంది. ఈ కంపెనీతోపాటు మరికొన్ని సంస్థలు కూడా హైదరాబాద్‌లో నెలకొని ఉన్నాయి. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ఐటీ రంగం అభివృద్ధిని అన్ని పార్టీలు, సంస్థలు ఆసక్తిగా చూస్తున్నాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇప్పటికే కార్యాలయాలను కలిగి ఉండగా, ఇటీవల గూగుల్ భారతదేశంలో అతిపెద్ద క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి యోచిస్తోంది. ఇలాంటి ప్రకటనల ఆధారంగానే ఇప్పుడు హైదరాబాద్(hyderabad) అంతటా విలాసవంతమైన రియల్ ఎస్టేట్, వాణిజ్య నిర్మాణాలు జరుగుతున్నాయి. టెక్ కంపెనీల వృద్ధి మందగిస్తే, ఆర్థిక వృద్ధిలో అనివార్యంగా క్షీణత స్థాయికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలోనే పలు సంస్థలు రేవంత్ కు వెయ్యి కోట్ల రూపాయల నగదును క్యాష్ ప్రైజ్ గా ఇస్తున్నట్లు తెలిసింది.