PDPL: అంతర్గాం మండలం అంతర్గాం టీటీఎస్‌లో ఎస్సారెస్పీ కాల్వకు పడిన గండిని సర్పంచ్ ఆంగోత్ రవి కుమార్ నాయక్ పూడ్చివేయించారు. కాల్వ నీరు ఇళ్లలోకి చేరుతుండటం, రైతులు సాగునీటి కోసం ఇబ్బంది పడుతుండటంతో ఆయన అధికారులతో మాట్లాడి దగ్గరుండి మరమ్మతులు చేయించారు. కాంక్రీట్‌తో గండిని పూడ్చి నీటి వృధాను అరికట్టారు. సర్పంచును గ్రామస్థులు అభినందించారు.