టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ సోదరుడు పారాక్వాట్ అనే విషపూరిత గడ్డిమందు వల్ల మరణించాడు. దీంతో ఈ రసాయనం తెలంగాణలో సులభంగా లభించడంపై రాహుల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. దీనివల్ల జరుగుతున్న మరణాలను చూసి వైద్యులు కూడా విస్మయానికి గురవుతున్నారని పేర్కొంటూ.. ప్రాణాలను కాపాడేందుకు వెంటనే పారాక్వాట్ను నిషేధించాలని CMO, PMO కార్యాలయాలకు ఆయన విజ్ఞప్తి చేశాడు.