TG: శ్రీరామ నవమి వేళ హైదరాబాద్ సీతారాంబాగ్ రామాలయంలో నిర్వహించిన శ్రీ సీతారామ కళ్యాణోత్సవంలో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా సతీసమేతంగా పాల్గొన్నారు. అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘శ్రీరాముడు ఆదర్శ పుత్రుడు, భర్త, పురుషుడు. మన భారతీయ సంస్కృతిలో రామాయణం ఎంతో విశిష్టమైనది’ అని పేర్కొన్నారు.