అన్నమయ్య: బోరెడ్డిగారిపల్లిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల సమస్యలు స్వయంగా విని, వెంటనే పరిష్కరించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు తమ వినతులను సమర్పించగా, వాటి పరిష్కారానికి మంత్రి హామీ ఇచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మంత్రి గారిని పుష్పగుచ్ఛాలతో సత్కరించారు.