PPM: ఎల్విన్ పేట గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీరాములవారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రీరాములవారిని పల్లకిలో భక్తులు ఊరేగించారు. అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతుందన్నారు.