ADB: జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షల కోసం 7 కేంద్రాలను (పది-4, ఇంటర్-3) ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాల నిఘాతో పాటు తాగునీరు, వెలుతురు వంటి వసతులు కల్పించాలని ఆదేశించారు. విద్యార్థుల కోసం ఉదయం 7 గంటల నుంచే బస్సులు నడపాలని, పోలీస్ భద్రతతో పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు.