GNTR: తాడేపల్లి మండలం ఉండవల్లిలో జేబుదొంగతనాలకు పాల్పడుతున్న విష్ణు, విక్టర్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దివ్యాంగ శక్తి పథకం బస్సు యాత్రలో పలువురి జేబులు కత్తిరించినట్లు గుర్తించారు. నిందితులపై ఉమ్మడి గుంటూరు జిల్లాలో 8 కేసులు, రాష్ట్రవ్యాప్తంగా మరో 6 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ.75,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వీరేంద్ర తెలిపారు.