AP: సదరం సర్టిఫికెట్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 57,452 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వీరి వైకల్య ధ్రువీకరణకు 110 ఆస్పత్రుల్లో ఈనెల 30 నుంచి మే నెలాఖరు వరకు 80 వేల వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వైకల్య శాతంపై అప్పీల్ చేసుకున్నవాళ్లు తొలుత పొందిన ఐడీని సంబంధిత ఆస్పత్రుల్లో తొలగించుకోవాలని సూచించారు. ఆ తర్వాత మళ్లీ అప్లై చేసుకోవాలన్నారు.