AP: మార్కాపురం బస్సు ప్రమాదంలో మరణించిన 14 మంది మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. అయితే సజీవదహనం కావడంతో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో DNAతో సరిపోల్చేందుకు ప్రయాణికుల కుటుంబ సభ్యుల నుంచి శాంపిల్స్ సేకరించి విజయవాడకు తరలించారు. అటు గాయపడినవారిలో 11 మంది మార్కాపురం ఏరియా ఆస్పత్రిలో, మరో 16 మంది ఒంగోలు GGHలో చికిత్స పొందుతున్నారు.