KMM: ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ‘ఇసుక వాహనం’ యాప్ను ప్రవేశపెట్టిందని తహసీల్దార్ ఉషాశారద తెలిపారు. గురువారం ఎర్రుపాలెం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 31వ తేదీ నుంచి యాప్ ద్వారానే ఇసుక కూపన్లు జారీ చేస్తామని, ఇకపై బ్యాంకుల్లో డీడీలు తీయాల్సిన అవసరం లేదని సూచించారు.