E.G: మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఆస్తి, ఖాళీస్థలం, కుళాయి పన్నులను సకాలంలో చెల్లించాలని రాజమండ్రి నగర కమిషనర్ రాహుల్ మీనా గురువారం కోరారు. సౌకర్యార్థం కార్పొరేషన్ కార్యాలయం, లాలాచెరువులో 8 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. పెనాల్టీలు తప్పించుకోవాలంటే త్వరగా పన్నులు చెల్లించాలని ఆయన సూచించారు.