GDWL: రాజోలి మండలం మార్దొడ్డి పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వార్డు సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు మండల ఎంపీడీవో మహమ్మద్ అబ్దుల్ సయ్యద్ ఖాన్కు వినతి పత్రాన్ని అందజేశారు. వార్డు సభ్యులకు తెలియకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయనకు విన్నవించారు. తెల్ల కాగితంపై సంతకం పెట్టాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.