Eesha Rebba: బ్లాక్ చీరలో ఈషా.. ఎంత ముద్దుగా ఉందో..!
చూడగానే ఆకర్షించే అందం ఆమెది. కానీ అదృష్టం కలిసిరాక తెలుగులో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. తెలుగు అమ్మాయి అనే ట్యాగ్ వల్లేనేమో ఈషా రెబ్బ ఇక్కడ పెద్దగా చెప్పుకోదగిన అవకాశాలు రాలేదు. కానీ ఇతర భాషల్లో మాత్రం ఆమె అదరగొడుతోంది. ఏవి పడితే అవి కాకుండా తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు ఎంచుకుంటూ గుర్తింపు పెంచుకుంటుంది.
కేవలం సినిమాలు మాత్రమే కాకుండా, వెబ్ సిరీస్ లతోనూ తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే పిట్ట కథలు, త్రీ రోజెస్ లాంటి వెబ్ సిరీస్లల్లో మెరిసింది. ఈ రెండు వెబ్ సిరీస్లు బాగా ఆకట్టుకున్నాయి. కాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది.
తాజాగా చీరలో హాట్ పిక్స్ షేర్ చేసింది. బ్లాక్ కలర్ శారీలో కనిపించింది. దానికి డిజైన్డ్ బ్లౌజ్ ఆ చీరకు మరింత అందాన్ని తీసుకువచ్చింది. హెయిర్ ని లూస్ గా వదిలేసింది. ఆమె ధరించిన జ్యూవెలరీ చీరకు మరింత అందాన్ని తీసుకువచ్చింది. చూడగానే చాలా ముద్దుగా కనపడుతోంది. ఇంత అందంగా ఉన్న ఈ అమ్మాయి ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా ఎందుకు ఎదగలేదా అనే సందేహం చాలా మందికి కలుగుతోంది.
ఇదిలా ఉండగా ఈషా ‘అంతకు ముందు.. ఆ తర్వాత’ సినిమాలో తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ మూవీతో ఆమె అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు వస్తాయని అనుకుంది కానీ రాలేదు. అరవింద సమేతలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. కానీ అది కూడా పెద్దగా ప్రాధాన్యత ఉన్న పాత్ర కాకపోవడంతో, మళ్లీ ఏ స్టార్ హీరో సినిమాలోనూ అవకాశం దక్కలేదు.