CTR: జిల్లాలో అండర్-7, అండర్-9 బాలబాలికల విభాగంలో జిల్లా స్థాయి చదరంగం పోటీలు ఈనెల 29న నిర్వహించనున్నట్లు ది ఆల్ చిత్తూరు చెస్ డెవలప్మెంట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ అన్నారు. పోటీలు చిత్తూరు వేపమాను వీధిలోని సంఘం కార్యాలయంలో జరుగుతాయి. ఆటగాళ్లు తమ పేర్లను www.apchess.org వెబ్సైట్లో లేదా 9849313676 నంబరును సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.