KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామ నవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం నుంచి వచ్చే నెల (ఏప్రిల్ ) 5 వరకు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు ఆలయ తనిఖీ అధికారి నవీన్ కుమార్ తెలిపారు. అర్చన, అంతరాలయం ప్రవేశం,అభిషేకం, స్వర్ణ పుష్పార్చన సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెప్పారు. అందరికీ సర్వ దర్శనం వసతి కల్పిస్తామని తెలిపారు.