NTR: కంచికచర్ల మండలం మోగులూరు గ్రామంలో పేకాట శిబిరంపై పోలీసులు గురువారం మెరుపు దాడి చేశారు. రాబట్టిన సమాచారం మేరకు గ్రామంలోని పామాయిల్ తోటలో పేకాట ఆడుతున్న 15 మంది అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు ఎస్సై నాని నరేంధర్ తెలిపారు. నిందితుల నుంచి రూ. 15,180 నగదు, 11 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.