TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ భద్రాచలంలో పర్యటించనున్నారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుని, రూ. 351 కోట్లతో ఆలయ విస్తరణ తొలిదశ పనులకు భూమి పూజ, శంకుస్థాపన చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి 10.10 గంటలకు భద్రాచలం చేరుకుంటారు. 11.05 నిమిషాలకు ఆలయ అభివృద్ధి కోసం భూమి పూజ చేయనున్నారు. అనంతరం మిథలా స్టేడియంలో జరిగే రామయ్య కళ్యాణంలో పాల్గొంటారు.