TPT: సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్కు నూతన ఎస్ఐగా అజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.ఇంతకుముందు దొరవారిసత్రం ఎస్ఐగా విధులు నిర్వహించిన ఆయన బదిలీపై సూళ్లూరుపేటకు వచ్చారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం మాట్లాడుతూ.. పట్టణ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, కాలేజీలు మరియు పాఠశాలల సమయాల్లో ఆకతాయిలపై కఠిన నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.