MBNR: మిడ్జిల్ మండలం రాణిపేట గ్రామ సర్పంచ్ మాధవి మల్లేష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తన సొంత ఖర్చుతో పీర్లమసీద్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా గురువారం పీర్లమసీద్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేసి సర్పంచ్ని అభినందించారు.