KNR: జమ్మికుంట మార్కెట్లో పత్తి ధర నిన్నటి కంటే ఈరోజు స్వల్పంగా పెరిగింది. బుధవారం క్వింటా పత్తి ధర రూ. 7,600 పలుకగా.. గురువారం రూ. 100 పెరిగి రూ. 7,700 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. నేడు మార్కెట్కు రైతులు 9 వాహనాల్లో 80 క్వింటాళ్ల విడి పత్తిని తీసుకువచ్చినట్లు చెప్పారు.