ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పన్నుల వసూళ్ల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. మున్సిపల్ సిబ్బంది ప్రతి ఇల్లు, వాణిజ్య సంస్థలను సందర్శించి పన్నులు సేకరిస్తున్నారని, ప్రజలు బాధ్యతగా ముందుకు వచ్చి పన్నులు చెల్లిస్తున్నారని కొనియాడారు. నగర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.