ADB: జిల్లా వ్యాప్తంగా 21,000 విత్తన కిట్లను పంపిణీ చేస్తున్నామని, ఒక్కో కిట్ విలువ సుమారు రూ.500 ఉంటుందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. రైతులు కేవలం సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలపై దృష్టి సారించాలని సూచించారు. భూమి లేని వారు తేనెటీగల పెంపకం వంటి కార్యక్రమాల ద్వారా ఆర్థికంగా ఎదగవచ్చన్నారు.