MDK: తూప్రాన్ మండలంలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి సుభావల్లి తీర్పు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. తూప్రాన్ మండలం జెండాపల్లి గ్రామానికి చెందిన సోమగారి భాస్కర్ (27) ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసుల విచారణలో నేరం రుజువు కావడంతో శిక్ష విధించినట్లు వివరించారు.