MBNR: కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం కోసం రూ. 600 కోట్లు మంజూరు అయినట్లు మేయర్ గుమ్మల మమత శ్రీనివాస్ వెల్లడించారు. గురువారం కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ దొడ్డలోని పల్లిలో వారు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.