MDCL: చికెన్ కంపెనీలు చికెన్ షాప్ ఓనర్స్ పై విధించిన మార్జిన్ కోతపై నిరసనగా అల్వాల్ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఏప్రిల్ 1న బంద్కు పిలుపునిచ్చింది. అన్ని చికెన్ షాపులు, కంపెనీ అవుట్లెట్లు మూసివేయాలని నిర్ణయించారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనను తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.