NLR: ఇటీవల మాతృ వియోగం చెందిన ఆంధ్రప్రదేశ్ వక్స్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్‌ను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పరామర్శించారు. నెల్లూరులోని అజీజ్ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే, వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుఃఖ సమయంలో ధైర్యంగా ఉండాలని, దేవుడు ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆకాంక్షించారు.