WGL: దుగ్గొండి బస్టాండ్‌లో బుధవారం Arrive -Alive అవగాహన కార్యక్రమాన్ని ఎస్సై రణధీర్ రెడ్డి నిర్వహించారు. అనంతరం ఆయన “HIT TV” తో మాట్లాడుతూ.. డ్రైవింగ్ సమయంలో మద్యం సేవించరాదని, తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలని సూచించారు. రోడ్డు భద్రత నియమాలు పాటించి సురక్షిత ప్రయాణం చేయాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు.