ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో నాలుగంతస్థుల బిల్డింగ్ కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరికొందరు బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. లక్నోలోని, హజ్రత్ గంజ్ ప్రాంతంలోని ఒక నాలుగంతస్థుల భవనం మంగళవారం రాత్రి కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, జాతీయ విపత్తు నిర్వహణా బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. ఇప్పటివరకు శిథిలాల కింద చిక్కుకున్న 12 మందిని అధికారులు రక్షించారు. ఇంకా కొందరు శిథిలాల కిందే ఉన్నారు. వారిని కూడా సురక్షితంగా రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా ఐదుగురు శిథిలాల కింద ఉన్నట్లు గుర్తించారు. బాధితుల్ని రక్షించే ప్రయత్నాలు అన్నీ శాస్త్రీయంగా జరుగుతున్నాయని ఉత్తర ప్రదేశ్ డీజీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. బిల్డింగ్ యజమానిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు