Tirumalaను హిందూ రాష్ట్రంగా ప్రకటించండి: రమణ దీక్షితులు
తిరుమలను హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోడీని టీటీడీ గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు కోరారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
Ramana Dikshitulu: టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు (Ramana Dikshitulu) ఏపీ సర్కార్‌పై ఆగ్రహాంతో ఉన్నారు. ఆలయ పరిపాలనను హిందూయేతర అధికారులకు అప్పగిస్తున్నారని గుర్రుగా ఉన్నారు. ప్రధాని మోడీ నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల గురించి పోస్ట్ చేసి మోడీకి ట్యాగ్ చేశారు. ఆ ట్వీట్లో సంచలన వ్యాఖ్యలు ఉండటంతో వైరల్ అయ్యింది. విమర్శలు రావడంతో చివరికీ ట్వీట్ డిలేట్ చేశారు.
భారత ప్రధాని మోడీకి శుభోదయం అని ట్వీట్ స్టార్ట్ చేశారు. తిరుమల శ్రీవారి ఆలయ పరిపాలనను హిందూయేతర అధికారులకు కట్టబెట్టారు. సనాతన ఆచారాలు, టీటీడీ పరిధిలో గల పురాతన నిర్మాణాల ధ్వంసం కొనసాగుతోంది. వాటి నుంచి తిరుమలను రక్షించి, అత్యవసరంగా హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి. శ్రీవారి ఆశీస్సులు మీకు ఉంటాయని’ పోస్ట్ చేశారు.
ఆ పోస్ట్ పెట్టారో లేదో రమణ దీక్షితులపై విమర్శలు వచ్చాయి. అతనిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పలువురు తీవ్రస్థాయిలో కామెంట్స్ చేశారు. దీంతో కాసేపటి తర్వాత ఆ పోస్ట్‌ను రమణ దీక్షితులు తొలగించారు. జగన్ సర్కార్ లక్ష్యంగా పోస్టు చేసి కలకలం రేపారు. మరి దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.