»Malla Reddys Daughter In Law Preethi Reddy Allegations On Congress
Malla Reddys daughter in law: వాళ్లు నా రూంకు వచ్చి బెదిరించారు
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కాంగ్రెస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఓ హోటల్లో ఉంటే..తన వద్దకు వెళ్లి పలువురు కాంగ్రెస్ నేతలు బెదిరించారమని అంటున్నారు.
Malla Reddy's daughter in law preethi reddy allegations on congress
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి(preethi reddy) కాంగ్రెస్ పార్టీ నేతలపై కీలక ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 20 నుంచి 25 మంది వచ్చిన తనను బెదిరించారమని ఆమె తెలిపింది. వారిలో కొంత మంది ఆడవాళ్లు, కొంత మంది మగవాళ్లు ఉన్నారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆమె కారులో కూర్చుని వివరాలను వెల్లడిస్తున్న ఓ వీడియోను విడుదల చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రీతిరెడ్డి గత నెల రోజులుగా మేడిపల్లిలోని ఎస్వీఎం గ్రాండ్ హోటల్లో ఉంటున్నట్లు చెప్పారు. ఆ క్రమంలోనే మధ్యాహ్నం 12 గంటల సమయంలో పాతిక మంది కాంగ్రెస్ నేతలు తన రూం వద్దకు వచ్చి బెదిరించి, దూషించారని ఆమె ఆరోపించింది.
అయితే మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవుతుందనే భయంతోనే తనను బెదిరిస్తున్నారని ప్రీతిరెడ్డి చెబుతున్నారు. ఇలాంటి బెదిరింపులకు పాల్పడటం సరికాదని ఆమె అన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే ఆమె చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని కాంగ్రెస్ నేతలు(congress leaders) అంటున్నారు. మాల్లారెడ్డి కోసం ఆమె చేస్తున్న ప్రచారం అడ్డుకోవాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాదు మల్లారెడ్డి చేసిన భూ కబ్జాలు నియోజకవర్గ ప్రజలకు తెలుసని అన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ప్రజలు మల్లారెడ్డిని ఓడించి బుద్ది చెబుతారని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు.