సూర్యాపేట – శ్రీశైలం ఆర్టీసీ బస్సు సమయాల్లో మార్పులు చేసినట్లు డిపో మేనేజర్ సునీత తెలిపారు. మార్చి 27 నుంచి ఉదయం 9:30 గంటలకు బదులు, 7:20 గంటలకే బస్సు బయలుదేరుతుంది. దీనివల్ల భక్తులు మధ్యాహ్నం 3:30 గంటలకే క్షేత్రానికి చేరుకుని, అదే రోజు స్వామివారిని దర్శించుకోవచ్చు. ప్రయాణికులు ఈ వెసులుబాటును గమనించి, ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని అన్నారు.