TG: ‘మేరా యువ భారత్’ ఆధ్వర్యంలో రాష్ట్రంలో వికసిత్ భారత్ యువ పార్లమెంట్ సందడి మొదలైంది. ఇప్పటికే రాష్ట్రంలోని 33 జిల్లాల్లో జిల్లా స్థాయి పోటీలు విజయవంతంగా ముగిశాయి. అందులో గెలుపొందిన ఐదుగురు చొప్పున అభ్యర్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు హాజరవుతారు. హైదరాబాద్లోని MCRHRD వేదికగా మార్చి 28, 29 తేదీల్లో ఈ రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయి.