WGL: నగరంలోని భీరన్నకుంటలో అక్రమంగా పేలుడు పదార్థాలు నిల్వ చేసి విక్రయిస్తున్నారనే సమాచారంతో గురువారం టాస్క్ ఫోర్స్ పోలీసులు శివరాత్రి అనిత ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో జెలటిన్ స్టిక్స్, డెటోనేటర్లు, కార్డెక్స్ వైర్లు, అమోనియం నైట్రేట్ వంటి సుమారు రూ.21,450 విలువైన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎసీపీ మధుసూదన్ తెలిపారు.