ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, 60వ డివిజన్లో పర్యటించి రోడ్లు, డ్రైనేజీ పనులను పరిశీలించారు. మౌలిక సదుపాయాల కల్పనలో నాణ్యతకు పెద్దపీట వేయాలని, ఇంజనీరింగ్ ప్రమాణాలను పాటిస్తూ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనుల నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు.