BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం,మహా పట్టాభిషేక వేడుకల నిర్వహణకు దేవాదాయ శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరిగే ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు మొత్తం 14 మంది సభ్యులతో ఈ కమిటీని నియమించారు.