VSP: ప్రస్తుతానికి రాజకీయాల్లో తటస్థంగానే ఉంటానని మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఏ పార్టీలో చేరాలనే దానిపై భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటానని మీడియా సమావేశంలో వెల్లడించారు. 2024 ఎన్నికల తర్వాత వైసీపీకి రాజీనామా చేసిన ఆయన.. టీడీపీ లేదా జనసేనలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.