GDWL: ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు పరిశుభ్రంగా ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు. గురువారం ఆయన ఇటిక్యాల మండల కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పదో తరగతి విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి 100% ఫలితాలు సాధించాలని సూచించారు.