SRD: ఖేడ్ మండలం పోతనపల్లి గ్రామంలో గురువారం ఖేడ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో కంటి వైద్య నిపుణులు డా. ముదసిర్ శిబిరానికి వచ్చిన 65 మందికి నేత్ర పరీక్షలు చేశారు. ఇందులో కంటి చూపు లోపించి అత్యవసరమైన వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలకు రెఫర్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనసూయ సంగమేశ్ ఉన్నారు.