NLG: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ పార్లమెంటు సభ్యులు, అఖిలభారత గీత పనివారల సంఘం వ్యవస్థాపకులు బొమ్మగాని ధర్మం బిక్షం ఆశయ సాధన కోసం పోరాడాలని గీత పనివారల సంఘం చిట్యాల మండల కార్యదర్శి దేశగాని బాలరాజు పిలుపునిచ్చారు. ధర్మ బిక్షం వర్ధంతి సందర్భంగా చిట్యాల మార్కెట్ యార్డులో ఆయన చిత్రపటానికి సీపీఐ నేతలతో కలిసి పూలమాలవేసి నివాళులు అర్పించారు.