AP: అమరావతికి చట్టబద్ధత కోసం అసెంబ్లీలో తీర్మానం అవసరమేంటి అని YCP కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అలాగైతే శాసనమండలిలోనూ చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. అమరావతిలో CM చంద్రబాబు అవినీతి యజ్ఞం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిపై జగన్కు అభ్యంతరం లేదని, అవినీతికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. అవినీతిని ప్రశ్నిస్తే అమరావతి వ్యతిరేకమంటున్నారని విమర్శించారు.