»Today Is The Second T20 Between India And Australia
IND vs AUS: నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20
నేడు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ టీ20 మ్యాచ్ సాగనుంది.
ఆస్ట్రేలియాతో నేడు 2వ టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ టీ20 సిరీస్లో ఇప్పటికే ఒక మ్యాచ్లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో తొలి మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. ఆదివారం తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం భారత్, ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే తిరువనంతపురం స్టేడియానికి చేరుకుని కసరత్తులు ప్రారంభించారు.
నేడు జరగబోయే ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా తిరువనంతపురంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. వెదర్ రిపోర్ట్ ప్రకారంగా నవంబర్ 26వ తేదిన వర్షం కురిసే అవకాశం ఉంది. నిన్న కూడా భారీ వర్షాలు కురవడంతో స్టేడియంలో వర్షపు నీరు నిలిచాయి. ఈ తరుణంలో నేడు మ్యాచ్ జరుగుతుందో లేదోనని సందేహం కూడా ఉంది. ప్రస్తుతం 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో 1-0 ఆధిక్యంలో భారత్ ముందంజలో ఉంది.