»If He Does That There Is A Chance For Rohit To Play T20 World Cup Muttiah Muralidharan
Muttiah Muralidharan: అలా చేస్తే రోహిత్ టీ20 వరల్డ్ కప్ ఆడే ఛాన్స్ ఉంది
రోహిత్ శర్మ 2024 టీ20 ప్రపంచకప్‌లో ఆడాలంటే కోహ్లీలా ఫిట్నెస్ కాపాడుకోవాలని శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పేర్కొన్నారు. ఆయనకు నెక్ట్స్ వరల్డ్ కప్ కూడా ఆడే సత్తా ఉందన్నారు.
If he does that, there is a chance for Rohit to play T20 World Cup.. Muttiah Muralidharan
Muttiah Muralidharan: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ వన్డే ప్రపంచకప్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరింది. కప్ గెలవాల్సిన మ్యాచ్‌లో బోల్తా పడింది. దాంతో రోహిత్(Rohit Sharma) సారథ్యంలో వరల్డ్ కప్ కలగానే మిగిలిపోయింది. 36 ఏళ్ల రోహిత్ 2027 ప్రపంచకప్ వరకు వన్డేల్లో కొనసాగుతాడా లేదా అన్నది తెలియదు. తరువాత 2024లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీలోనైనా రోహిత్ శర్మకు స్థానం ఉంటుందా లేదా అనేది ఆయన అభిమానుల ప్రశ్న. ఎందుకంటే 2022 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో ఓటమి అనంతరం రోహిత్, విరాట్ కోహ్లీ తరువాత జరిగిన టీ20 మ్యాచ్‌లలో ఆడలేదు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మపై శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (Muttiah Muralitharan) కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ 2027లో జరిగే ప్రపంచకప్ ఆడే సత్తా ఉందన్నారు. అయితే తాను విరాట్ కోహ్లీలా ఫిట్నెస్ కాపాడుకోవాలని, అలా అయితేనే 2024లో జరిగే టీ20లో కూడా ఆడతాడన్నారు.
వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ ప్రదర్శన అద్భుతంగా ఉందన్నారు. అన్ని మ్యాచ్‌లు చక్కగా ఆడాడని, మంచి స్ట్రైక్ రేట్‌తో దూసుకెళ్లాడని తెలిపాడు. ప్రస్తుతం ఆయనకు ఇంకా 36 ఏళ్లే అని, ఇంకా ఆయన యువకుడే అని, కోహ్లీలా అతను తన ఫిట్నెస్ను కాపాడుకుంటే మరొక ప్రపంచ కప్ ఆడగలడని వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్లో చాలా అనుభవం ఉన్న ప్లేయర్ రోహిత్ అని, ఏ ఆటగాడైనా 35 ఏళ్ల తర్వాత ఆడాలనుకుంటే ఫిట్నెస్ను కాపాడుకోవాలని ముత్తయ్య మురళీధరన్ తెలిపారు. ఇదే విషయంపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మాట్లాడారు. హిట్‌మ్యాన్ టీ20 ప్రపంచకప్‌లో ఆడాలని నిర్ణయించుకోవాలని, దానికి కూడా ఆయనే కెప్టెన్సీ వహించాలని పేర్కొన్నారు. రోహిత్‌కు టీ20ల్లో మంచి రికార్డు ఉందని, 148 టీ20 మ్యాచ్‌ల్లో 139.25 స్ట్రైక్‌రేట్‌తో 3,853 పరుగులు చేయడం విశేషం. ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులలో కోహ్లీ తర్వాతే రోహిత్ శర్మనే ఉన్నారు.