»Case Registered In Delhi Against Australian Player
Australia: ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ మార్ష్ పై ఢిల్లీలో కేసు నమోదు!
వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్ల తీరుపై క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు మిచెల్ మార్ష్ ప్రపంచకప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి బీరు తాగడం కలకలం రేపుతోంది.
Australia: వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్ల తీరుపై క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు మిచెల్ మార్ష్ ప్రపంచకప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి బీరు తాగడం కలకలం రేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు కూడా విమర్శిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో ప్రతిష్టాత్మకమైన, గౌరవప్రదమైన ప్రపంచకప్ ను ఇలా అవమానించడం తగదని క్రికెట్ అభిమానులు ఆసీస్ ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ చర్యను క్రికెట్ అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త పండిట్ కేశవ్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు మిచెల్ మార్ష్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ట్రోఫీని అవమానించారని, 140 కోట్ల మంది భారతీయుల మనోభావాలను దెబ్బతీశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అలా చేయడం తనకు బాధ కలిగించిందని మార్ష్ చెప్పాడు.